![]() |
![]() |

బుల్లితెర మీద టిక్ టాక్ భాను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు.. శ్రీదేవి డ్రామా కంపెనీలో కొంతకాలం బాగా కనిపించింది. పల్సర్ బైక్ రమణ కూడా ఈటీవీ షోస్ కి వచ్చినప్పుడల్లా భాను మీద సాంగ్స్ పాడుతూ ఉండేవాడు. ఒక ఈటీవీ ఫెస్టివల్ ఈవెంట్‌లో పాడుతూనే భానుకి ప్రపోజ్ చేశాడు కానీ భాను మాత్రం పెద్దగా రియాక్ట్ కాలేదు. ఐతే ఆ ఎపిసోడ్ మాత్రం బాగా హైలెట్ అయ్యింది మంచి రేటింగ్ కూడా వచ్చింది. ఇక ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కడా కనిపించడం లేదు. అలాంటి భాను ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఫుల్ అప్డేట్ గా ఉంటుంది. ఐతే లవర్స్ డే సందర్భంగా ఒక పిక్ ఐతే పోస్ట్ చేసింది. ఐతే అందులో తన లవర్ ఎవరో రివీల్ చేయలేదు. అందులో ఎర్ర గులాబీలు, రెండు చేతులు, రెండు ఐస్ క్రీములు తప్ప ఇంకేం కనిపించలేదు. "మా బంధానికి అంతం లేదు" అనే అర్ధం వచ్చేలా "ఎండ్ లెస్ అజ్" అని కాప్షన్ పెట్టుకుంది అలాగే మైన్ అనే హ్యాష్ టాగ్ కూడా పెట్టుకుంది. ఈ పిక్స్ కి పాగల్ పవిత్ర ఐతే హే కంగ్రాట్యులేషన్స్ బేబ్స్ అని మెసేజ్ పెట్టింది.

ఇక మరో నెటిజన్ ఐతే "అంత భయం ఉన్నప్పుడు ఎందుకు లవ్ చేయడం" అని అడిగేసరికి ఇంకో నెటిజన్ రిప్లై ఇచ్చారు. "అది భయం కాదు. దిష్టి తగులుతుంది అని. సమాజంలో ఎవరైనా మంచి ఉంటే ఓర్వలేరుగా బ్రో...కొన్ని విషయాలు పర్సనల్ గా ఉంటేనే బెటర్ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా" అని ఆన్సర్ ఇచ్చారు. ఇక భాను రకరకాల ఫోటో షూట్స్ తో నెటిజన్స్ ని సోషల్ మీడియాలో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. టిక్‌టాక్‌తో వచ్చిన క్రేజ్ వల్లే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షో ఛాన్సులు కొట్టేసింది.. అలానే అప్పుడప్పుడూ ఈటీవీలో జరిగే కొన్ని ఈవెంట్స్, షోస్ కి వస్తూ ఎంటర్టైన్ చేస్తోంది టిక్ టాక్ భాను.
![]() |
![]() |